తెలుగుదేశం నేత ఇంట్లో సీబీఐ సోదాలు

మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లనను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించి సీబీఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గోట్టారు అనే ఆరోపణలపై రాయపాటి కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలో రెండుసార్లు సీబీఐ అధికారులు సోదాలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించారు.

తమ కంపెనీ సీఈవోగా పనిచేసిన శ్రీధర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతడిపై సీబీఐకి రాయపాటి కుటుంబం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీధర్ ఫేక్ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సీబీఐకి సమాచారం ఇచ్చారట. ఈ నేపథ్యంలో రాయపాటి నివాసం, కార్యాలయంతో పాటుగా శ్రీధర్ ఇళ్లల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు.