Site icon TeluguMirchi.com

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి మీద సీబీఐ రైడ్స్

జీఎస్టీ వెరిఫికేషన్‌ వింగ్‌ సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని బొల్లినేనిపై అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికే ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఆయనపై సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు.

అదేవిధంగా విజయవాడతో పాటు హైదరాబాద్‌లో కూడా సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బొల్లినేని నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ప్రస్తుతం జీఎస్టీ సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. గతంలో ఆయన ఈడీలో కూడా పని చేశారు.

కాగా వరుసగా పలుచోట్ల దాడులు కొనసాగిస్తున్న అధికారులు ఇప్పటివరకు రూ. 3.75 కోట్ల అమక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం అందుతుంది. ఆఫీసుల్లోనూ కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌ గాంధీ పనిచేశారు. కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీ అత్యంత సన్నిహితుడుగా చెప్పవచ్చు.

Exit mobile version