’తాటా తీస్తా..’ తెచ్చిన తంటా !!

pawan

రాష్ర్ట రాజకీయాల్లోకి అనూహ్య పరిణామాల మధ్య ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌. పార్టీ ఆవిర్భావ ప్రసంగంతోనే ఆకట్టుకున్న పవన్‌.. తనదైన శైలిలో పంచ్‌ డైలాగ్ లతో కాంగ్రెస్‌, తెరాసపై నిప్పులు చెరిగారు. ’నమో.. ’ జపంతో భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి దగ్గరయ్యాడు. కలసి వేదికను పంచుకొన్నాడు. ఈ నేపథ్యంలోనే.. తెరాస అధినేత కేసీఆర్ ని టార్గెట్ చేశాడు. ఎంతగా అంటే… 125యేళ్ల చరిత్ర వున్న కాంగ్రెస్ కూడా ఆ రేంజ్ లో కేసీఆర్ ను అటాక్ చేయలేదు. వరంగల్ సభలో ఏకంగా కేసీఆర్.. ’నీ తాటా తీస్తా’ అని హెచ్చరించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదాస్పదమైనాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నన్యాయస్థానం పవన్‌పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. అయితే, పవన్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.. బంగారు తెలంగాణ కోసం జైలుకెళ్లడానికి సిద్ధమని ప్రకటించాడు. మొత్తానికి.. పవన్ పంచ్ డైలాగ్ కేసు తంటాను తెచ్చిపెట్టింది.