తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గా పదవి బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్..పోలీసులు కేసు నమోదు చేసారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో కరోనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలపైన కేసు నమోదయ్యింది. జిల్లాలోని పెద్దవూర పోలీసులు సంజయ్ కుమార్‌పై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.