కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి బాగా సహకరిస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్నారు. ‘‘ఎవరూ భయాందోళన చెందవద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రభుత్వ సూచనల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఐసోలేషన్ పడకల కోసం 5వేల రైల్వే కోచ్లు ఆధునీకరించాం’’ అని తెలిపారు.
ఇదీలావుంటే దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి 24 గంటల్లో 386 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 1637 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.