తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 28 కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది. తాజాగా మరో రెండు మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 16కి పెరిగింది. ఇవాళ తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న ఏడుగురిని డిశ్చార్జి చేశారు.
కాగా, తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 30వ తేదీ వరకు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని, ఈ 15 రోజులు పాటు ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. ఆ తర్వాత దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేస్తామని వెల్లడించారు.