రాజధాని ఎక్కడ.. ?

seemandhra capital questionరాష్ట్ర విభజన విషయంలో.. కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. తెలంగాణ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ అంశం ఓ కొలిక్కి వస్తే.. ఇక తేలాల్సింది సీమాంధ్ర రాజధాని విషయమే. రాజధాని విషయాన్ని నాన్చినట్లయితే.. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో తెలంగాణ-సీమాంధ్రుల మధ్య చెలరేగిన వివాదం వలనే.. రేపు రాయలసీమ-కోస్తా ప్రాంతాల మధ్య పునరావృతం అయ్యే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి సీమాంధ్రకు రాజధానిని ఎక్కడ కేటాయిస్తారు అన్నదాని వైపు మల్లుతోంది. కేంద్రం కూడా ఆ దిశగా వివరాలు సేకరించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు ప్రాంతాలపైన అధ్యయనం చేసిన కేంద్రం పలానా.. ప్రాంతం అని చెప్పకుండా కీలక సిఫార్సు చేసినట్లు సమాచారం.

సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలంటే.. దాదాపు లక్ష ఎకరాలు కావాల్సిందే. ఎందుకంటే.. హైదరాబాద్ విస్తీర్ణం లక్షన్నర ఎకరాలు. అయినా.. ట్రాఫిక్ కష్టాలు.. వైగారా వుండనే వున్నాయి. అందువలన భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే సుమారు లక్ష ఎకరాల భూ విస్తీర్ణంలోనైనా కొత్త రాజధానిని ఫ్లాన్ చేయాలి. ఇంత పెద్ద విస్తీర్ణం గల భూమిని భూసేకరణ ద్వారా సేకరించడం తలకుమించిన భారం. పైగా భారీ వ్యయంతో కూడుకున్నది అవుతుంది. ఈ నేపథ్యంలో.. లక్ష ఎకరాల విస్తీర్ణం, వ్యయంను దృష్టిలో వుంచుకొని కేంద్రం రాజధానికి అటవీప్రాంతాన్ని ఎంపికచేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పైగా అటవీ ప్రాంతం కేంద్రం అధీనంలోనే వుంటుంది… దానికి తోడు నిర్మాణ సమయంలో పర్యావరణ నియామవళి అడ్డంకులు తొలగుతాయన్నది కేంద్రం ప్లాన్ గా కనిపిస్తోంది.సీమాంధ్రకు రాజధానిని ఏర్పాటు విషయంలో.. కేంద్రం దృష్టిలో వున్న కొన్ని ప్రాంతాలు ఇవే..

* ప్రకాశం-కర్నూలు మధ్యనున్న అటవీ ప్రాంతం. దీనివల్ల రాయలసీమ వారిని సంత్రుప్తి పరచవచ్చు.

* గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డునే వున్న అటవీ ప్రాంతం. ఇక్కడే అయితే, పులిచింతల నుంచి నీరు తీసుకోవచ్చు. * పై రెండు సాధ్యం కాకపోతే.. గోదావరి నుంచి నీరు తీసుకునేలా.. ఆ ప్రాంతంలో గల అటవీ ప్రాంతాన్ని పరిశీలించవచ్చని కేంద్రం సిఫార్సు చేసినట్లు సమాచారం.

అయితే, విభజన విషయంలో ఇప్పటికే తమకు అన్యాయం జరుగుతుందని రాయల సీమ నేతలు తీవ్ర నిరసన తెలుపుతున్న నేపథ్యంలో.. కేంద్రం మొదటి ఆప్షనే కన్ఫమ్ చేయొచ్చన్నది విశ్లేషకుల భావన.