Site icon TeluguMirchi.com

బడ్జెట్ రూపకల్పనలో లోపాలున్నాయి : కాగ్

CAGరాష్ర్ట ఆర్థిక పరిస్థితులపై శాసనసభకు ఈరోజు (మంగళవారం) 2012 కాగ్ నివేదిక సమర్పించింది. రాష్ర్ట బడ్జెట్ రూపకల్పనలో లోపాలు ఉన్నట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చుల నిర్వహణలో సమతుల్యం లేదని, కేటాయింపులు లేనివాటికి కూడా ఖర్చులు పెట్టారని, ఆయా ప్రభుత్వ శాఖల్లో ఆర్థిక నియమాల ఉల్లంఘన జరిగిందని కాగ్ వెల్లడించింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోవంతు మిగులు ఏర్పడిందని, సామాజిక, అభివృద్ధి పథకాల అమలు విషయంలో లోపాలు జరిగాయని పేర్కొంది. జలయజ్ఙం ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారని, అయితే వాటి ఖర్చు నిర్వహణ సరిగా జరగలేదని కాగ్ పేర్కొంది. 

శాసనసభకు సమర్పించిన కాగ్ నివేదికలోని వివరాలు :
• 2011-12 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ప్రభుత్వ అప్పు రూ.1,64,085 కోట్లు
• ద్రవ్య బాధ్యతలు రూ.1,50,512 కోట్లు
• బడ్జెట్ యేతర రుణాలు రూ.12,087 కోట్లు
• వడ్డీ, ఇతర గ్యారెంటీలు రూ.12,286 కోట్లు
• కీలక శాఖలు నిధుల్ని పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయాయి
• 2011-12 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల రుణాల్ని బడ్జెట్లో ప్రస్తావించని ప్రభుత్వం
• ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమం శాఖల్లో నిధులు భారీగా మిగిలాయి: కాగ్
• పంచాయతీరాజ్ శాఖల్లోనూ అదే పరిస్థితి
• బీసీ సంక్షేమం, స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం,
• ఉన్నత విద్య శాఖలో భారీగా నిధులు మిగులు
• వెనుకబడిన తరగతుల సంక్షేమం, స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం,
• ఉన్నత విద్య, మున్సిపల్ పరిపాలన, సాంఘిక సంక్షేమం,
• పంచాయతీరాజ్ శాఖల్లో కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయలేకపోయాయి
• ఉన్నత విద్య: వాస్తవ ఖర్చుకంటే నిధులధికం
• ఉద్యోగుల ఖాళీల భర్తీ చేయకపోవడం, యూజీసీ గ్రాంట్లు రాకపోవడం
• కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు,
• మున్సిపల్ పరిపాలన: పనుల పురోగతిలో మందకొడి
• సాఘింక సంక్షేమం: స్కాలర్ షిప్పులు ఆలస్యంగా ఇవ్వడం
• ఖాళీలు భర్తీ చేయకపోవడం నిర్వాహణ పనుల్లో పురోగతి
• బీసీ సంక్షేమం: స్కాలర్ షిప్పులు విడుదలలో జాప్యం
• ఫీజు రీయింబర్స్ వచ్చే ఏడాది వాయిదా
• పంచాయతీ రాజ్: పనుల్లో జాప్యం, నిర్వాహణ పనుల వాయిదా
• అనుమతి ఉత్తర్వుల విడుదల కాకపోవడం
• సాగునీటి రంగానికి సంబంధించిన పనులు పూర్తి చేసేలా
• ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి – కాగ్
• సాంఘిక, ఆర్థిక రంగాలకు మూలధనం అవసరమున్న వాటికి ప్రభుత్వం ప్రాధామ్యాలు నిర్ణయించుకోవాలి
• అభివృద్ధి వ్యయానికి నిర్దేశించిన నిధులు వినియోగించకోలేదు
• విద్యా రంగంపై రాష్ట్ర వ్యయం కేవలం 13.80 శాతమే
• ఇతర రాష్ట్రాల్లో 17.18 శాతం
• విద్యా, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

Exit mobile version