Site icon TeluguMirchi.com

పది జిల్లాల ’తెలంగాణ’కే కేబినేట్ పట్టం!

shindeరాయల తెలంగాణ వెనక్కుపోయి.. తెలంగాణ ముందుకొచ్చింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణకే కేంద్ర కేబినేట్ పట్టం కట్టింది. హైదరాబాద్ పై స్వల్ప ఆంక్షలు మినహాయించి.. భద్రాచలం సహా సంపూర్ణ తెలంగాణకు కేబినేట్ ఆమోద్ర ముద్ర వేసింది. నిన్నరాత్రి ప్రధాని మన్మోహన్ నివాసంలో సుదీర్ఘంగా జరిగిన కేబినేట్ సమావేశంలో టీ-బిల్లుకు రాజముద్రపడింది. ఇక టీ-బిల్లు రాష్ట్రపతి అటు నుంచి అసెంబ్లీకి వెళ్లడమే తరువాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రి కావూరి సీమాంధ్ర సమస్యలపై ఎంత గావుకేక పెట్టినా.. కేబినేట్ పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది.

బిల్లులోని ముఖ్యాంశాలు :

* 10 జిల్లాల తెలంగాణ, 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌

* భద్రాచాలం డివిజన్, మునగాల తెలంగాణలోనే.

* పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా జీహెచ్ ఎంసీ

*తెలంగాణకు 119 మంది ఎమ్మెల్యేలు, 40మంది ఎమ్మెల్సీలు, 17లోక్ సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు

* ఆంధ్ర ప్రదేశ్ కు 175 మంది ఎమ్మెల్యేలు, 50మంది ఎమ్మెల్సీలు, 25లోక్ సభ, 11 రాజ్యసభ సభ్యులు

* రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్, కేంద్రం నియమించే ఇద్దరు సలహాదారులు గవర్నర్‌కు సహకరిస్తారు.

* కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ఇప్పుడు వున్న హైకోర్టే ఉమ్మడిగా పనిచేస్తుంది.

* ఏపీపీఎస్సీ ఆంధ్రపదేశ్ కు చెందుతుంది. తెలంగాణ కోసం కొత్త పబ్లిక్ సర్వీస్ ను ఏర్పాటు చేస్తారు.

* జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పల పంపిణీ

* అఖిల భారత సర్వీసుల కేడర్ 2రాష్ట్రల మధ్య విభజన

* కృష్ణా గోదావరి నదుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రెండు ప్రత్యేక బోర్డుల ఏర్పాటు. కేంద్ర జనవనరుల మంత్రి, రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల నేతృత్వంలోని సర్వోన్నత మండలి ఈ బోర్డులను పర్యవేక్షిస్తుంది.

* 371డి రెండు రాష్ట్రాలో అమలులో వుంటుంది.

* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజదాని అన్వేషణ కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు. కొత్త రాష్ట్ర ఏర్పాటు చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల లోపు ఇది నివేదికను అందిస్తుంది.

* రెండు రాష్ట్రాల్లోను పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తోంది.

* వచ్చే పదేళ్లలో అంటే.. 12, 13 పంచవర్ష ప్రణాళికలలో ఆంధ్రప్రదేశ్ లో ఐఐటీ, ఎన్ ఐటీ, ఐఐఎం, ఐఐఎన్ ఈఆర్, కేంద్ర విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ ఏర్పాటు

* ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బోధనా కేంద్రం నిర్మాణం.

Exit mobile version