Site icon TeluguMirchi.com

మరోసారి ఉద్యోగుల్ని తొలగించిన బైజూస్


దిగ్గజ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కంపెనీని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మరోసారి లేఆఫ్స్ విధించింది. తొలి విడతలో2,500 మందిని తొలగించిన కంపెనీ.. తాజాగా మరో 100 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. కాగా వీరు ఏ విభాగానికి చెందిన ఉద్యోగులు అన్న విషయం మాత్రం చెప్పలేదు. కానీ ఈ తొలగింపులు సేల్స్, మార్కెటింగ్ బృందాలకు సంబంధించినవిగా తెలుస్తోంది. గత ఆరు నెలల్లో ఉద్యోగుల తొలగింపు ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల నుంచి పెర్ఫామెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్‌లో ఉన్న ఉద్యోగుల్ని.. ఆగస్టు 17న స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరింది కంపెనీ. అయితే ఈ క్రమంలో చాలా మందితో వివాదాలు నెలకొన్నాయి. తాము లేఆఫ్స్‌కు గురైనట్లు హెచ్‌ఆర్ ద్వారా గురువారమే తెలిసిందని ఉద్యోగులు వాపోయారు.

Exit mobile version