3 లక్షల కోట్ల అప్పుతో ఏపీ శ్వేతపత్రం రిలీజ్…!

3 లక్షల 62 వేల కోట్ల రూపాయల అప్పు భారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదల చేసింది జగన్ సర్కార్. గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందని.. ప్రస్తుతం ఆ అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయన్నారు ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. రాష్ట్ర రెవెన్యూ లోటు 66 వేల కోట్ల రూపాయలకు పెరిగిందన్న బుగ్గన పన్ను రూపంలో వచ్చే ఆదాయం పరంగా చూసినట్లైతే తెలంగాణ కంటే మనం బాగా వెనుకబడి ఉన్నామన్నారు.

 

ఇక ద్రవ్యోల్బణం జాతీయస్థాయిలో తగ్గింది. ఏపీలో మాత్రం వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం రాష్ట్ర జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయకూడదు. కానీ గత ప్రభుత్వం ఆ పరిమితిని దాటి అప్పులు చేసింది. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరగిందని.. చేపల పెంపకం పెరిగినంత మాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని తప్పుబట్టారు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. దీని పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.