Site icon TeluguMirchi.com

బడ్జెట్ 2023 : ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే …


కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశపెట్టారు. అందులో కస్టమ్స్ డ్యూటీ మార్పులతో కొన్ని వస్తువుల ధరలు పెరగటం.. మరి కొన్ని తగ్గుతున్నాయి. బడ్జెట్​లో మొబైల్స్‌, టీవీలు, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ని తగ్గిస్తూ కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అలాగే సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచారు. ఫలితంగా…కొన్ని వస్తువులు ఖరీదైనవి.. కొన్ని చౌకగా మారతాయి. చాలా వస్తువులు ఖరీదయ్యాయి. తాజాగా బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలతో బొమ్మలు, సైకిల్, టీవీ, కిచెన్ చిమ్నీలు చౌక అయ్యే అవకాశం కనిపిస్తోంది.

దీంతో పాటుగా మొబైల్, ఎలక్ట్రిక్ వాహనం, బయోగ్యాస్ సంబంధిత వస్తువులు, మొబైల్ ఫోన్లు, కెమెరా లెన్సులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటో మొబైల్స్, ఎల్‌ఈడీ (లెడ్) టీవీ ధరలు తగ్గనున్నాయి. అదే విధంగా..బంగారం, వెండి, వజ్రాల ధరలు మరింత పెరగనున్నాయి. ప్లాటినం, వెండి పాత్రలు, దేశీ కిచెన్ చిమ్నీ,విదేశాల నుంచి వచ్చే వెండితో తయారు చేసిన 6 ఖరీదైన వస్తువులు, సిగరెట్లు..దిగుమతి చేసుకున్న తలుపుల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కస్టమ్స్ సుంకాలను పెంచవచ్చు. గత బడ్జెట్‌లో కూడా, అనుకరణ ఆభరణాలు, గొడుగులు, ఇయర్‌ఫోన్‌లు వంటి అనేక వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయాలని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

Exit mobile version