ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుకు అంత ఫిదా అవుతున్నారు. ఈరోజు (జులై 01 ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 104, 108 సర్వీసుల్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయనేతలు , అభిమానులు , కార్య కర్తలే కాక సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సైతం జగన్ ఫై ప్రసంశలు కురిపించారు.
ఈ ప్రాజెక్టులో సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసు పాలు పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల ప్రాజెక్టుల్లో టెక్నికల్, లీడ్ పార్టనర్లుగా ఉన్న అరబిందో ఫార్మా, యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసులో భాగమైన సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసులకు కూడా ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.