Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్ కి బ్రిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్ చేయూత

bridge international academy
వివిధ దేశాలలో విద్యావ్యాప్తికి తోడ్పడుతున్న బ్రిడ్రి ఇంటర్నేషన్ అకాడమీస్ (బిఐఏ) ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జి హబ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామి కావటానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ షన్నన్‌మే షన్నన్ మే విజయవాడలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జిహబ్ గా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి, తపన గమనించామని, విద్యాభివృద్ధికి ఎంతో దార్శనికతతో వ్యవహరిస్తున్న ఆయన లాంటి ముఖ్యమంత్రులు అరుదుగా వుంటారని, సమాచార విశ్లేషణతో నిర్ణయాలు తీసుకుంటారని ప్రశంసించారు. బాలల విద్యావికాసానికి ఆయన ఎంతో కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్ గా రూపొందించటంలో సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్యారంగ అభివృద్ధిలో దశాబ్దాలపాటు తమ సంస్థ భాగస్వామి అవుతుందని చెప్పారు. ప్రస్తుతం బ్రిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్ తన ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తుందని, తర్వాత అమరావతికి తరలిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.రాష్ట్రంలో నర్సరీ విద్య (early childhood education), ప్రాథమిక విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తక్కువ వ్యయంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యాప్రమాణాలను పెంచటంలో బ్రిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్ ఎంతో కృషి చేసిందన్నారు. ఇదిలా వుంటే బ్రిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్ ప్రస్తుతం ఉగాండా, నైజీరియా ఉగాండాలలో 400 అకాడమీలు ఏర్పర్చి అట్టడుగున వున్న లక్షలాది బాలలకు విద్యనందిస్తోంది. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో పనిచేయటానికి ముందుకు వచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ , ఫేస్ బుక్ సిఈఓ మార్క్ జుకర్ బెర్గ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కు చెందిన ఖోస్లా వెంచర్స్, ఐఎఫ్‌సి (వరల్డ్ బ్యాంక్ గ్రూప్) సహకారంతో బ్రిడ్జి ఇంటర్నేషనల్ అకాడమీస్ పనిచేస్తోంది.

Exit mobile version