Site icon TeluguMirchi.com

జేసీకి సత్తిబాబు క్లాస్..!

botsa jcవిభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి.. నేతల మధ్య మాటల యుద్దానికి దారితీస్తోంది. జగన్ తో కాంగ్రెస్ కుమ్మక్కైందని బహిరంగంగానే ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి మరీ.. అధిష్టానంపై అసహనం వెల్లగక్కుతున్నారు. తాజాగా, ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి విలేకరుల ముందు స్పష్టం చేశారు. అయితే, కుమ్మక్కు రాజకీయాలపై.. అలా అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారో లేదో.. విజయనగరంలో వున్న బొత్సకు ఫోన్ చేసి వరదల విషయాలను ప్రస్తావించారు. అయితే, సత్తిబాబు వరద నష్టాల గురించి ప్రక్కన బెట్టి.. జేసీ చేసిన కుమ్మక్కు రాజకీయాలపై ఆయనకు క్లాస్ పీకారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలి కాని ఇలా విమర్శలు చేస్తారా.. ? అని సత్తిబాబు ప్రశ్నించారు. దీనికి జేసీ కూడా గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి వెళ్లపొమ్మనే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జగన్ పార్టీ కుమ్మక్కు కాలేదని గట్టిగా చెప్పగలరా.. ? అని ఎదురు ప్రశ్నించారు. అయితే, అదిష్టానాన్ని విమర్శిస్తూ.. లేనిపోని ఆరోపణలు చేయడం పద్దతి కాదని బొత్స స్పష్టం చేసినట్లు సమాచారం. సత్తిబాబు ఇంకెంత మంది.. నేతలకు క్లాస్ పీకాల్సి వస్తుందో.. మరీ..!

Exit mobile version