సత్తిబాబు కొత్త స్తుతి..!

botsaవిభజన బిల్లు అసెంబ్లీకి వస్తే.. వ్యతిరేకిస్తామని పీసీసీ చీఫ్ బొత్స స్పష్టం చేశారు. ఈరోజు (గురువారం) విజయనగరం మున్సిపాలిటీలో సమస్యలు, అభివృద్ధి పనులపై బొత్స సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తామూ సమైక్యవాదులమేనని, తమ ఇళ్ల ముందు ధర్నాలు చేయవలసిన అవసరం లేదని అన్నారు. తామంతా సీమాద్ర ప్రజల మనోభావాలను శాసనసభలో
వినిపిస్తామని, అసెంబ్లీలో టీ-బిల్లును వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. అయితే, విభజనకు బొత్స అనుకూలంగా ప్రవర్థిస్తున్నారంటూ.. గతకొద్దిరోజుల క్రితం సమైక్యవాదులు ఆయన నివాసంపై దాడులు తరచుగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. విజయనగరం జిల్లాలో కొన్ని రోజుల పాటు కర్ఫ్యూని కూడా విధించారు. విభజనకు ముందు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో వున్న బొత్స.. విభజన ప్రకటన అనంతరం అటు అధిష్టానం ను ఎదురించను లేక ఇటు సొంత జిల్లాల్లో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేక తెగ ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అందుకే సత్తిబాబు సమయం చూసి ఇలా.. అప్ప్పుడప్పుడు సమైక్యరాగాన్ని ఆలపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.