Site icon TeluguMirchi.com

బొత్స.. సమైక్యవాదే.. !

botsaపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎప్పుడు ఏ వాదానికి వాలుతాడో ఎవరికీ అంత సులువుగా అర్థం కాదు. గతంలో ప్రత్యేకవాదిగా చెప్పుకునే.. దాదాపు అదే రీతిలో శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చిన బొత్స బాబూ.. ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పుట్టిన రోజు సందర్భంగా బొత్స ఈరోజుతిరుమల వెళ్లి శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. తిరుమలలో బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్లలో నేను ఒకడినని తెలిపారు. అయితే, తప్పని సరి కేంద్రం నిర్ణయం తీసుకుంటే మాత్రం.. నేతలందరు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించాడు. గతంలో.. తెలంగాణ ఏర్పడితే తప్పేంటి అన్న.. బొత్స ప్లేటు ఫిరాయించడానికి అసలు కారణం.. స్వొంత జిల్లాలలో నేతలు సమైక్యాంధ్ర ఉద్యమం వైపు మొగ్గు చూపడమేనని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. కాగా, మళ్లీ మాట మార్చి తెలంగాణకు అనుకూలమని అంటాడేమో.. ఎందుకంటే వాదం మార్చడం ఈ వాది కొత్తేమీ కాదు కదా..!

Exit mobile version