నెలాఖరున అసెంబ్లీకి ’టీ’-బిల్లు : బొత్స

botsaవిభజన బిల్లు ఈ నెలాఖరున అసెంబ్లీ వచ్చే అవకాశం వున్నట్లు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సమన్వయ కమిటీ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారని బొత్స పేర్కొన్నారు. బొత్స ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. మూడో విడత రచ్చబండ కార్యక్రమం కొనసాగుతుందని.. అర్హులైన వారందరికి రేషన్ కార్డులు, ఫించన్లు, ఇళ్ల స్థలాలు  కేటాయిస్తామని తెలిపారు. విభజనపై ఇరుప్రాంతాల్లో కాస్త వాతావరణం వేడికెక్కినప్పటికిని.. ఎక్కడా… సంక్షేమ పథకాలు ఆగలేదని చెప్పుకొచ్చారు. మంత్రి బాలరాజు విషయంపై స్పందిస్తూ.. బాలరాజుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వున్నదని తెలిపారు. టీ-బిల్లు ఈ నెలాఖరున అసెంబ్లీకి వస్తుందని పీసీసీ హోదాలో బొత్స చెప్పడంతో.. విభజన బిల్లుపై అధికారిక ప్రకటనగా భావించాలేమోనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.