ఎందుకు రాజీనామాలు చేయాలి !

botsaసమైక్యాంధ్ర ఉద్యమం తీరుతెన్నులపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమకారులు సంయమనం పాటించాలని హితవు పలికారు. జాతీయనేతల విగ్రహాలు ధ్వంసం చేయడం పట్ల స్పందిస్తూ.. విగ్రహాలేంచేశాయని ప్రశ్నించారు. వాటిని కూల్చడం సరికాదన్నారు. తాను త్వరలోనే అధిష్ఠానాన్ని కలిసి విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరతానని వెల్లడించారు. ఇక, కేసీఆర్ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ… హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చెప్పే హక్కు ఎవరకి లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో నాయకులు సమయమనం పాటించాలని సూచించారు. రాజధాని ఎక్కడ అనేది అసలు సమస్యే కాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వస్తుంది, ఆ సమయంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెలిపేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు సభలో ఉండాలని ఆయన గుర్తు చేశారు.