Site icon TeluguMirchi.com

Botsa : లూలు మాల్ ని అందుకే పెట్టనివ్వలేదు


ఏపీ లో ప్రస్తుతం తిరుమల లడ్డు హాట్ టాపిక్ గా నడుస్తున్న నేపధ్యంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రబుత్వం పై పలు విమర్శలు చేశాడు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 4 వేల మంది కార్మికులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. “ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, “ఆ ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది పక్కనపెడితే, ఈ 4 వేల మందిని అయినా ఉద్యోగాలు కోల్పోకుండా చూడండి,” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాలంటీర్లకు 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు గానీ, వారి ఉద్యోగ భద్రతపై ఎలాంటి హామీ లేదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం మందు ధరలు తగ్గించామని సంబరాలు చేసుకుంటున్నప్పటికీ, నిత్యావసర కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ పెరుగుదల పేద ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మార్కెట్ పునరుద్ధరణ కోసం రెండు కోట్లు ఖర్చు చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల జీవితాలను మరింత కష్టతరం చేసే విధంగా ధరలు పెంచిందని ఆరోపించారు. వైజాగ్‌లో లులు కంపెనీలు పెట్టుబడులు పెడతాయని ప్రభుత్వం హడావిడిగా ప్రచారం చేస్తోందని, 1300 కోట్ల విలువైన భూముల్లో కేవలం 600 కోట్ల పెట్టుబడే పెడతామన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై ఆలోచించి వాటిని వ్యతిరేకించాల్సి వచ్చిందని, ప్రత్యామ్నాయంగా ఇనార్బిట్‌ మాల్ని తీసుకొచ్చామని బొత్స పేర్కొన్నారు. “ఎన్నో మంచి పనులు చేశాం, కొన్ని చిన్నపాటి తప్పుల వల్ల ప్రజలు మీకు అధికారం అప్పగించారు. మీరు ఇచ్చిన ఎన్నో హామీలు ఉన్నాయి, వాటిని నెరవేర్చండి,” అంటూ బొత్స ప్రభుత్వం మీద తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తపరిచారు.

Exit mobile version