365 రోజులు తాగేవారా… ?

ysrపీసీసీ అధ్యక్షుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే ఉద్దేశంతో.. ఈసారి ఏకంగా  రాష్ట్రంలో కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోనికి తీసుకొచ్చిన దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర రెడ్ది బ్రాంధి బాంబునే ఎంచుకొన్నారు.  కానీ ఈసారీ ఎంచుకొన్న బాంబు ఇటీవల కాలంలో పేల్చిన బాంబులన్నింటికంటే పవర్ ఫుల్ గా పేలింది. రాజకీయవర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. అదే వైఎస్ ఆర్ 365 రోజులూ.. తాగేవారేనా..? అని.

“కాంగ్రెస్ నాయకులు గాంధీ వారసులు కాదు… బ్రాందీ వారసులని” షర్మిల పాదయాత్రలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, షర్మిల వ్యాఖ్యలకు ధీటుగా బొత్స స్పందించారు. సంవత్సరంలోని 365 రోజులు నీ తండ్రి (వైఎస్ ఆర్) బ్రాందీ ముట్టులేదని చెప్పగలవా..? అంటూ.. తనను పదేపదే లిక్కర్ డాన్ అని సంబోధిస్తున్న షర్మిలకు బొత్స సవాల్ విసిరారు. అంతటితో..  ఆగకుండా పనిలోపనిగా బ్రదర్ అనిల్ ను బాదేశాడు. తాను ఎంపీగా ఉన్న సమయంలో.. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నిసార్లు తన దగ్గరికి బ్రదర్ అనిల్ వచ్చాడో తెలుసుకోవాలని  షర్మిలకు సూచించాడు.

అంత అనేసి చివరగా..  వైఎస్ రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ నేతగా ఇప్పటికీ గౌరవిస్తామని, కేవలం వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనతో తాము ఇలాంటి విషయాలు బహిర్గతం చేయాల్సి వస్తోందని బొత్స బాబు చెప్పుక్చ్చారు. షర్మిల అన్నమాటల్లో తప్పేముంది.. “కాంగ్రెస్ నాయకులు గాంధీ వారసులు కాదు.. బ్రాందీ వారసులనే” కాదా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రియేనని.. అంటే కాంగ్రెస్ నాయకుడే కదా.. అని  రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.