కేసీఆర్ ఏమైనా హైకమాండా?

botsa-kcrపీసీసీ చీఫ్ బొత్స కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. రాజీనామా చేస్తే అందరం కలిసే రాజీనామాలు చేస్తామని అన్నారు. సీఎం డెడ్ లైన చెప్పడానికి కేసీఆర్ ఏమైనా కాంగ్రెస్ హైకమాండా అని విమర్శించారు. 2014 వరకు సీఎం మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం ఇమేజ్, తన ఇమేజ్ పెరిగితే పార్టీ ప్రతిష్ట కూడా పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను చర్చించడానికి ఆయన రేపు ఢిల్లీ వెల్లనున్నారు. ఎల్లుండి కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో బొత్స ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది.