Site icon TeluguMirchi.com

మళ్లీ మొదటికి రాజధాని భూముల రచ్చ

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అమరావతి నిర్మాణం కోసం రైతుల నుండి భూములను తీసుకున్న విషయం తెల్సిందే. అయితే రైతుల నుండి భూములను లాక్కున్నట్లుగా వైకాపా మొదటి నుండి ప్రచారం చేస్తూనే ఉంది. కాని టీడీపీ మాత్రం రైతులు స్వచ్చందంగా వచ్చి అభివృద్ది కోసం అంటూ తమ భూములను ఇచ్చారంటూ చెబుతూ వచ్చారు. తాజాగా వైకాపా ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రాజధాని భూముల విషయమై మళ్లీ చర్చ మొదలైంది.

మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మాట్లాడుతూ రాజధాని భూములు తీసుకునే విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని, సామాన్య రైతులకు అన్యాయం జరిగిందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు. రాజధాని భూములు అన్ని వర్గాల నుండి ఒకే విధంగా కాకుండా ఇష్టానుసారంగా రేట్లు ఇచ్చి తీసుకోవడం జరిగిందని, తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ భూముల విషయంలో పెద్ద అవినీతికి పాల్పడ్డట్లుగా ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై విచారణ జరిపి తీరుతాం అని, దోషులను శిక్షిస్తాం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. దాంతో రాజధాని భూముల రచ్చ మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.

Exit mobile version