ఉభయ సభలు రేపటికి వాయిదా !

lokhsabha-300x165సమైక్యాంధ్ర సెగలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ.. సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీల ఆందోళనలతో సభ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమయిన తరవాత కూడా సమైక్యాంధ్ర నినాదాలతో సభ మారుమ్రోగడంతో.. స్వీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అయితే, సమైక్యాంధ్ర నిరసనల మధ్యనే ఎంపీ సెల్జా రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై కొద్దిసేపు చర్చించారు.

రాజ్యసభలో సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీలు పోటాపోటీగా నినాదాల మధ్య సభ రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదరంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటిన చేశారు. అయితే, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని సక్రమంగా నిర్వహించ లేకపోతుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆరోపించారు.