Site icon TeluguMirchi.com

ఇద్దరూ.. ‘సస్పెండ్’ అవుతారా..?

JAC-leadersతెలంగాణ రాజకీయ జేఏసీ మార్చి 21న నిర్వహించిన ‘సండక్ బంద్’ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ‘సడక్ బంద్’ సందర్భంగా అరెస్టై జైలులో ఉన్న తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులకు మహబూబ్ నగర్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. పొలిటికల్ జేఏసీ చైర్మెన్ ప్రొ. కోదండరాం, తెలంగాణ ఉద్యోగాల కో-చైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ లు తమ తమ ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఏపీ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ కంట్రోల్ యాక్ట్ (1991) రూల్ 8 ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగయినా 48 గంటలకు మించి జ్యుడీషియరీ రిమాండ్ లో ఉంటే ఆ ఉద్యోగి ప్రభుత్వ సేవల నుంచి సస్పెండ్ అయినట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ ఆ ఉద్యోగి చేసిన నేరం రుజువైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ అవుతారు.

“సండక్ బంద్” కు నాయకత్వం వహించిన కోదండరాంపై పోలీసులు 147, 148, 341, 188, 427, 109, రెడ్ విత్ 149తో పాటు పీడీపీపీ యాక్టు నమోదు చేశారు. మొత్తం 11 మందిపై కేసులు నమోదు కాగా ముగ్గురు పరారీలో ఉన్నారు, కాగా, విచారణ పూర్తికాకపోవడంతో పాటు కొంతమంది పరారీలో ఉన్నకారణంగా బెయిల్ని రాకరిస్తున్నట్లు మహబూబ్ నగర్ కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా సడక్ బంద్లో అరెస్టైన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, మున్సిపల్ శాఖ ఉద్యోగి శ్రీనివాస్గౌడ్ ల ఉద్యోగాల నుంచి సస్పెండ్ విషయం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

 

Exit mobile version