ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది తన నివాసానికి వెళ్లి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు చేయగా.. నెగిటివ్‌గా తేలిందంటూ ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ లో వెల్లడించారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.