Site icon TeluguMirchi.com

హామీ నేరవేర్చని నేతలు – బోనం ప్రసాద్ బలి..

IMG-20160820-WA0010
ఆదుకునే నాథుడు లేక బోనం ప్రసాద్ బలయ్యాడు. గత మంగళవారం (date: 26/07/2016) కీసర దగ్గరలో ATMs కి డబ్బులు సప్లై చేసే వ్యాన్ రాంగ్ రూట్ వచ్చి వేగంగా ఢీకొట్టడంతో.. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలయ్యాడు.. పశ్చిమ గోదావరి జిల్లా,మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన బోనం ప్రసాద్. వెన్నుముక (స్పయినల్ కార్డ్ ఫెయిల్) ఇరడంతో మెడ క్రింద నుండి శరరీ భాగమంతా చచ్చుపడిపోయింది.

ఉపాదికోసం కొన్ని నెలల క్రితం హైదరాబాద్ వచ్చి సూపర్ వైజర్ గా నెలకి Rs 10,000 జీతానికి చేస్తున్నాడు ప్రసాద్. తండ్రి బోనం నర్సింహారావు.. మధ్య తరగతి కుటుంబం. అయితే, నాంపల్లి కేర్ హాసుపత్రిలో చేర్పించి బోనం ప్రసాద్ కి వైద్య ఖర్చులు నిమిత్తం రోజుకి 30-50వేల రూపాయలు ఖర్చుపెట్టారు కుటుంబ సభ్యులు. తహత లేకున్నా కొడుకుని ఎలాగైనా దక్కించుకోవాలని తండ్రి నరసింహారావు తెలిసిన వారి దగ్గర అప్పులు తెచ్చి కట్టారు. ఇప్పటి వరకు దాదాపు 8లక్షల వరకు ఖర్చు పెట్టారు.

బోనం ప్రసాద్ గురించి తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ యువనాయకుడు లోకేష్, MLA మాధవ్ నాయుడు కూడా స్పందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందిస్తామని హామి ఇచ్చారు. కానీ, సమయానికి డబ్బులు అందకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. తక్షణం ఆర్థిక సాయం అందేలా లోకేష్ చర్యలు తీసుకుంటే బాగుండేది.

అయితే, ఈలోపు బ్యాడ్ న్యూస్ వినాల్సివచ్చింది. శనివారం తెల్లవారు జామున బోనం ప్రసాద్ కన్నుమూశారు. కుటుంబాని శోక సముద్రంలో ముంచెత్తాడు. ఈ ఘటన ఇప్పుడు అందరినీ కలచి వేస్తోంది. సరైన వైద్యం అందించగలిగితే నా కొడుకు దక్కేవాడని తండ్రి బోరుమన్నాడు.

ఎంతటి దయనీయ పరిస్థితి అంటే.. మృతిడి మృతదేహాన్ని కూడా స్వస్థలానికి తరలించేందుకు డబ్బుల్లేవు. పరిస్థితిని అర్థ చేసుకొన్న మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు హైదరాబాద్ లో పోస్ట్ మర్తోమ్ పనులు, ప్రసాద్ కుటుంబానికి అంబులెన్స్ ఆరెంజ్ చేసి స్వస్థలానికి పంపించారు.

ప్రసాద్ పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన కొందరు నెటిజర్స్ వల్ల తండ్రి బోనం నర్సింహారావు బ్యాంక్ ఖాతాలో దాదాపు రూ. లక్ష వరకు జమచేశారు. కాపు వెల్ ఫేర్ బోనం ప్రసాద్ కి అండగా నిలిచింది. లక్ష రూపాయల వరకు కాపు వెల్ ఫేర్ నుంచి ఆర్తికసాయం అందింది. పోలీస్ యంత్రాంగం బోనం ప్రసాద్ ఘటనపై పాజిటివ్ గా స్పందించింది. వారి నుంచి అన్ని రకాల మద్దతు లభించింది. స్వయంగా డీజీపీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక, యాక్సెండ్ కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూసి.. ప్రసాద్ కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీస్ యంత్రాంగం చూస్తే మంచిది.

తెలంగాణలో మంత్రి కేటీఆర్.. పేపర్లు, ట్విట్టర్లు ఇతర మాధ్యమాల ద్వారా తెలిసిన దీన ఘటనలపై స్పందించి మరీ.. ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మంచి మనసు చాటు కుంటున్నారు.అదే బోనం ప్రసాద్ విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం. బహుశా ఏపీ వాడని లైట్ తీసుకున్నారేమో. తన దృష్టికి వచ్చిన ఇలాంటి అరుదైన కేసులపై లోకేష్ త్వరగా స్పందించి తక్షణం ఆర్థిక సాయం అందేలా చూస్తే ఇంకా బాగుండేది.

ఇప్పటికి బోనం ప్రసాద్ ఫ్యామిలీకి ఆర్తిక సహాయం అందించాలనుకునే వారు క్రింది బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయగలరని కోరుతున్నాం..

BONAM NARASIMHARAO
SBI
A/C NO : 30768839303
Branch : ROYAPET,NARSAPUR,WEST GODAVARI
IFSC CODE : SBIN0003362

Contact Details :
తండ్రి : బోనం నరసింహారావు Mob Num : 9505665330
అన్న : బోనం పెద్దబ్బులు Mob Num : 9573936045

Exit mobile version