ఒక పక్క కరోనా మరో పక్క కిట్ల రాజకీయం. ఇదీ ఏపీలో సీన్. ఏపీలో కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై వైకాపా.. భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, బిజెపి మధ్య ట్వీట్ల ప్రవాహం సాగుతోంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర బిజెపి గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డిని ‘సూట్‌కేస్ రెడ్డి’ అని సంబోధిస్తూ బిజెపి అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది.
తాజాగా విజయసాయి రెడ్డిపై ఉన్న కేసుల జాబితాను ట్విటర్‌లో ఉంచింది. ‘కాస్త కళ్లజోడు తుడిచి పెట్టుకుని చూడండి.. ఇది ఏపీ బిజెపి.. కరోనా వచ్చి ఇప్పుడు రాష్ట్రం క్వారంటైన్‌లో ఉంటే.. తాను చేసిన పనులతో విజయసాయి రెడ్డి 2012లోనే క్వారంటైన్‌లో ఉన్నారు’ . ‘పైత్యంతో ఉన్న కాస్త పరువును తీసుకోకండి. ఇవి మీ డిగ్రీలు కాదు.. నేర ఘనతలు’ అంటూ సెటైర్ వేసింది బిజెపి.