బీజేపీ పార్టీ ఏపీకి సంబందించిన కొత్త కమిటీని ప్రకటించింది..

భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన 10 మందితో కూడిన కొత్త కమిటీని ప్రకటించింది. ఈ పది మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులతో కమిటీ ఏర్పటు చేసింది. మొత్తం 40 మందితో సోమువీర్రాజు కొత్త టీమ్ సిద్ధమైంది.

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులుగా విష్ణుకుమార్‌రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మీ, మాలతీరాణి, నిమ్మల జయరాజు, ఆదినారాయణరెడ్డి, వేణుగోపాల్, రావెల, సురేందర్‌రెడ్డి, చంద్రమౌలిని నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా పీవీఎన్ మాధవ్, విష్ణువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణ రాజు, మధుకర్, ఎల్.గాంధీ… అధికార ప్రతినిధులుగా భాను ప్రకాష్‌రెడ్డి, పూడి తిరుపతిరావు, సుహాసిని ఆనంద్, సాంబశివరావు, ఆంజనేయరెడ్డి, ఎస్.శ్రీనివాస్.. ట్రెజరర్‌గా సత్యమూర్తి, ఆఫీస్ సెక్రటరీగా పి.శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు.