Site icon TeluguMirchi.com

ఎంపీల పోరాటం ఫలించినట్లేనా?

కేంద్ర బడ్జెట్‌లో కొత్త రాష్ట్రం ఏపీకి గత నాలుగు సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని, చివరి బడ్జెట్‌ అయిన ఈసారి కూడా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు గత వారం రోజులుగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనల సెగ మోడీ అండ్‌ కోకు తగిలినట్లుగా ఉంది. ఏపీకి చాలా చేశాం, ఇక చేసేది ఏమీ లేదు అన్నట్లుగా ఇటీవల మాట్లాడిన కేంద్ర పెద్దల మాటల్లో తేడా వచ్చింది.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రకటించిన నిధులను ఇస్తామని, చాలా రోజులుగా ఏపీ ప్రజలు కోరుకుంటున్న రైల్వే జోన్‌ను కూడా ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మిత్రధర్మం పాటించకుండా బీజేపీ చూపిస్తున్న వివక్షను టీడీపీ ఎత్తి చూపించే ప్రయత్నం చేసి సఫలం అయ్యింది. అందుకే బీజేపీ ఏపీకి ఇచ్చిన హామీలను నిలుపుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి కేంద్రం నుండి భారీ ఎత్తున నిధులు వస్తాయనే నమ్మకంను ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version