ప్రధాని రాజీనామా చేయాలి : భాజపా

parliament-budget-sessionsపార్లమెంట్ రెండో విడత సమావేశాలు హాట్ హాట్ కొనసాగుతున్నాయి. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రధాన ప్రతిపక్షమైన భాజపా పోరును తీవ్రతరం చేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేసి తీరాల్సిందేనని భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తెలిపారు. ఈరోజు ఉదయం సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు.. బొగ్గు కుంభకోణంలోకి మాజీ ప్రధాని అటల్ బిహారి వాయిపేయిని లాగడాన్ని తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. బొగ్గు కుంభం విషయంలో ఇక నుంచి మరింత దూకుడుగా వ్యవహరించాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని రాజీనామాని ఖండించారు. ప్రధాని రాజీనామ చేసే ప్రసక్తే లేదని 2014 వరకు యూపీఏ 2 ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.