Site icon TeluguMirchi.com

వైసీపీ వైపు భూమా ఫ్యామిలీ చూపు…!

కర్నూలు జిల్లా పాలిటిక్స్‌లో భూమా ఫ్యామిలీది ఎప్పుడు స్పెషల్ ప్లేసే. అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి రాజకీయ దురందరులు ఎవరు లేరు కేవలం వారసులు మాత్రమే ఉన్నారు. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసినప్పుడు నాన్న భూమా నాగిరెడ్డి అండగా ఉన్నారు. ఆ తరువాత నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి పదవి భరోసాగా నిలిచింది. కానీ ఇప్పుడు తండ్రి లేదు. పార్టీ పవర్‌లో లేదు కాబట్టి పదవీ లేదు. దీంతో ఒక్కసారిగా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల పొలిటికల్ కెరీర్ గందరగోళంలో పడింది.

ఇప్పుడు టీడీపీలో కొనసాగేందుకు అఖిల ప్రియకు ఏ మాత్రం ఆసక్తిగా లేదట. అలా అని వైసీపీలోకి వెల్దాం అనుకుంటే శత్రుశేషం అంతా అక్కడే ఉంది. గంగుల,ఇరిగెల కుటుంబాలకు భూమా కుటుంబానికి ముందు నుంచి వైరం ఉంది. తమ చిరకాల ప్రత్యర్థి గంగుల కుటుంబం వైసీపీలో ఉండగా.. భూమా అఖిల ప్రియ ఎంట్రీకి వారు ఏ మాత్రం అంగీకరించరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాబాయి ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ విషయంలో చివరి నిమిషంలో టీడీపీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన వైసీపీలో చేరారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మార్పు పై ఆలోచన చేస్తుంది మాజీ మంత్రి అఖిలప్రియ.

ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. కానీ రాజకీయ జన్మనిచ్చిన వైసీపీ వైపే చూస్తుందట అఖిలప్రియ. జగన్ తల్లి విజయమ్మతో టచ్‌లోకి వెళ్లేందుకు తెగ ట్రై చేశారట. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదని తెలుస్తుంది. జగన్ సిపుల్ గా సారి చెప్పేసీ పొలిటికల్ గా యాక్టివ్ అవుదామనుకున్నా వైరి వర్గం నుంచి ఒత్తిడితో అది సాధ్యమయ్యేల కనిపించట్లేదు.

ఇక నంద్యాల విషయానికి వస్తే అక్కడున్న ఆదిపత్యపోరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కనిపించదు. ముచ్చటగా మూడు వర్గాలతో నడుస్తున్న అక్కడి రాజకీయంలో ఓ వైపు బ్రహ్మానందరెడ్డి,మరో వైపు మాజీ మంత్రి ఫరూక్ ఇంకో వైపు ఏవీ సుబ్బారెడ్డి ఇలా అక్కడ కూడా బ్రహ్మానందరెడ్డి భవిష్యత్ పై క్లారిటీ లేకుండా పోయిందట. కొద్ది రోజులు గడిస్తేనే కానీ భూమా ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్ పై ఓ క్లారిటీ వచ్చేలా లేదు.

Exit mobile version