మంత్రి అఖిల ప్రియ చెల్లి మనోభావం

bhuma mounikaభూమ నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి దంపతుల కూతురు అఖిల ప్రియ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. చిన్న వయస్సులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సాధించిన అఖిల ప్రియ పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా అఖిల ప్రియ సోదరి భూమ  మౌనిక మాట్లాడుతూ అక్క అఖిల ప్రియకు మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

తాజాగా భూమ మౌనిక ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కకు మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాం. మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. అమ్మ లేదా నాన్నలో ఎవరో ఒకరు మంత్రి కావాలనేది నంద్యాల మరియు ఆళ్లగడ్డ ప్రజల అభిష్టం. వారి కోరిక అక్కకు మంత్రి పదవి రూపంలో తీరింది. వారికి అమ్మానాన్నల మాదిరిగా అక్క చూసుకుంటుందనే నమ్మకం ఉంది. ఇక తన రాజకీయా ప్రవేశం గురించి మాట్లాడుతూ తనకు రాజకీయాలు అంటే ఆసక్తి లేదు అని, తన దృష్టి మీడియా వైపు ఉందని చెప్పుకొచ్చింది. ఒక ఛానెల్‌ పెట్టే ఆలోచన కూడా ఉందని ఆమె పేర్కొంది.