మార్చివేసిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.
కీర్తి కండూతి కోసం తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కొన్ని పొరబాట్లు చేసిన మాట
వాస్తవమేనని, తన తప్పులు తాను తెలుసుకున్నానని ఆయన ఎటువంటి అహం లేకుండా చెప్పారు.
మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రైవేట్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలలో ఎటువంటి
అరమరికలు లేకుండా తన అభిప్రాయాలను చెప్పారు. ఏడు నెలల పాదయాత్ర తనపై ఎంతగానో
ప్రభావం చూపిందని, ప్రజలు తనపై నమ్మకంతో వున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తే
తమకు ప్రయోజనం కలుగుతుందనే విశ్వాసంతో వారున్నారని బాబు చెప్పారు. రాష్ట్రం లో ఏ వర్గం
ప్రజలూ సంతృప్తిగా లేరని, సామాన్య ప్రజలు, ప్రత్యేకించి రైతులు పడుతున్న కష్టాలు చూస్తుంటే
కడుపు తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి 80 శాతం గ్రామాల్లో తాగేందుకు
మంచినీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని, విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర
అంశాలలో రాష్ట్రం దారుణమైన స్థితిలో వుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టి కార్యకర్తలను
కంటికి రెప్పలాగా చూసుకుంటానని, కష్టపడే వారికి పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని ఆయన
తెలిపారు. తన వియ్యంకుడు బాలకృష్ణతో సహా ఎవరికి ఎప్పుడు ఎంత గుర్తింపు నివ్వాలో పార్టీ
నిర్ణయిస్తుందని బాబు స్పష్టం చేసారు. షర్మిల పాదయాత్ర గురించి ప్రస్తావిస్తూ ఈ విషయమై
తానేమి స్పందించబోనని, ఆమెది తన స్థాయి కాదని, తనపై ఆమె చేస్తున్న విమర్శలను తాను
పట్టించుకోనని ఆయన అన్నారు.
తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు విమర్సల గురించి మాట్లాడుతూ ఆయన అధికారమే పరమావధిగా
తెలంగాణా ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే అధికారం
అన్ని రాజకీయ పార్టీల వారికి ఉంటుందని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్నది లక్ష్యం
కానేకాదని, తనకు వ్యక్తిగతంగా ఎటువంటి కోర్కెలు లేవని, తనది పరిపూర్ణమైన జీవితమని ఆయన
తెలిపారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవటం ఒక
బాధ్యతగా తాను భావిస్తున్నానని, అందుకే ప్రజలతో మమేకమయ్యేందుకే తాను ఏడునెలలు
పాదయాత్ర చేశానని చంద్రబాబు వివరించారు. హరికృష్ణ వివాదం గురించి ప్రస్తావించగా ఇవన్ని చిన్న
విషయాలని, క్రమేపి అవే సర్దుకుంటాయని అన్నారు.