తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ఈరోజు (శుక్రవారం) హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. చండీఘడ్ లోని హర్యానా రాజ్ భవన్ కు వెళ్లిన శ్రీ బండి సంజయ్ గారు, కేంద్ర జలవనరుల, గంగా పునరుజ్జీవన ప్రాజెక్ట్ సలహాదారు వెదిరె శ్రీరాం, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం లతో కలిసి శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కలిశారు. హరియాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ బండారు దత్తాత్రేయ గారికి ఈ సందర్భంగా శ్రీ బండి సంజయ్ గారు శుభాకాంక్షలు తెలిపారు.