Site icon TeluguMirchi.com

కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్

రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ రాష్ట్ర ప్రభుత్వాన్న హెచ్చరించారు. బీజేపీ తరపున అడుగడుగునా ఆందోళనలు చేసి ఛార్జీల పెంపును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నరని, ఇకనైనా ఆర్టీసీ కార్మికులు మేల్కొని బయటకు వచ్చి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేసేలా కేసీఆర్ మెడలొంచి తీరుతామని, అక్టోబర్ 2 తరువాత సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని’’అని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే గతి అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలవల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేని ప్రభుత్వం పోలీసుల ద్వారా తమ సభలకు అడ్డంకులు స్రుష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ టీఆర్ఎస్ కు కొమ్ము కాసేలా ఉందని, పోలీసుల అమరవీరుల ఆత్మ నేటి పోలీస్ వ్యవస్థను చూసి ఘోషిస్తోందని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ శుక్రవారం ముస్తాబాద్ లో జరిగిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.

Exit mobile version