తెలంగాణలో దుబ్బాక ఎలక్షన్ రిసల్ట్ తరవాత రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సవాహం వచ్చింది, అదే జోరుతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాస ని దెబ్బకొట్టింది. అయితే తరువాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడటంతో ఆ పార్టీ కాస్త డైలమా లో పడగా, నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్న పుకార్లు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చాడు.
తెలంగాణలో మూర్ఖత్వపు పాలన సాగుతోంది అని తెరాస పై మండిపడ్డారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితి లోను బీజేపీ కి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదు అని స్పష్టం చేసారు. సంఘ విద్రోహ శక్తులకు టిఆర్ఎస్ వత్తాసు పలుకుతుంది అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.