Site icon TeluguMirchi.com

బండి సంజయ్ కి బెయిల్ నిరాకరణ, 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317జీవోకు నిరసనగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ను మానకొండూర్‌ నుంచి కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. ఇవాళ కరీంనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. బండి సంజయ్‌పై పోలీసులు మొత్తంగా 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా బండి సంజయ్‌ సహా ఐదుగురికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు తీర్పు అనంతరం వారిని కరీంనగర్‌ జైలుకు తరలించారు.

Exit mobile version