గత కొంతకాలంగా ముషీరాబాద్ బిజెపి సీటు మీద ఆశలు పెట్టుకున్న బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆ సీటును పూసల రాజుకు బిజెపి కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్నారు.. ఇదే అదునుగా అధికార బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆమెతో మాట్లాడి నామినేటెడ్ పదవి ఆఫర్ చేసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం… బిజెపి కురువృద్ధుడు దత్తాత్రేయ కుమార్తెగానే కాకుండా అన్ని అర్హతలు కలిగిన తనను బిజెపి పక్కన పెట్టడం తనకు ఎంతగానో మనస్థాపాన్ని కలిగించిందని ఆమె సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం… కేవలం లక్ష్మణ్ కి పోటీ అవుతాననే కారణంగానే తనను పక్కన పెట్టారని ఇది తనకు అవమానమేనని ఆమె సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం… చివరి నిమిషం వరకు టికెట్ మీద ఆశలు పెట్టి లక్ష్మణ్ కిషన్ రెడ్డి కలిసి భవిష్యత్తులో వారికి ఇబ్బంది రాకుండా తనను తప్పించారని ఆమె ఆపోతున్నట్టు తెలుస్తోంది… మరి బిఆర్ఎస్ ఆఫర్ చేసిన నామినేటెడ్ పదవికి ఒప్పుకొని ఆమె బిఆర్ఎస్ లో చేరుతారా లేదంటే బిజెపిలోనే కొనసాగుతారా చూడాలి కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె బిఆర్ఎస్ లోకి పక్కాగా చేరుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు ఇదే జరిగితే బిజెపిలో ఎంతో చరిత్ర కలిగిన దత్తన్న కూతురు బిఆర్ఎస్ లో చేరితే అది బిజెపికి నష్టమేనని చెప్పవచ్చు.