Site icon TeluguMirchi.com

అక్కడ మినరల్ వాటర్ బాటిళ్లపై నిషేధం విధించిన ప్రభుత్వం

సిక్కింలో వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మినరల్‌ నీటి సీసాల వినియోగాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి పీఎస్‌ తమాంగ్‌ ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం గ్యాంగ్‌టక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిషేధం అమలు తర్వాత హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన మంచినీటిని వినియోగించుకుంటామని చెప్పారు. ప్లాస్టిక్‌ సీసాల్లో ఉండే నీటి కంటే ఇది చాలా ఆరోగ్యకరమైనదని అన్నారు.

Exit mobile version