సిక్కింలో వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మినరల్ నీటి సీసాల వినియోగాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి పీఎస్ తమాంగ్ ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం గ్యాంగ్‌టక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిషేధం అమలు తర్వాత హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన మంచినీటిని వినియోగించుకుంటామని చెప్పారు. ప్లాస్టిక్ సీసాల్లో ఉండే నీటి కంటే ఇది చాలా ఆరోగ్యకరమైనదని అన్నారు.