Site icon TeluguMirchi.com

‘జేపీ’కి కాంగ్రెస్ గాలం.. !!

jpలోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకి కాంగ్రెస్ గాలం వేసినట్లు తెలుస్తోంది. డైరెక్టుగా కాకపోయినా..  ఆ పార్టీ సర్వే సత్యానారాయణ  జేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కాంగ్రెస్ లో కాలుపెడితే.. మల్కాజిగిరి టికెట్ ఇస్తానని ఆఫర్ చేశాడు. అందుకు అధినేత్రిని ఒప్పిస్తానని మాట కూడా ఇచ్చాడు. ఈ సరదా సన్నివేశం.. మూసాపేట్ లో వాటర్ రిజర్వాయర్ ను ప్రారంభించిన సందర్భంలో జరిగింది. సర్వే.. ఆఫర్ కు జేపీ నవ్వే సమాధానం అయినట్లు తెలుస్తోంది. మరీ.. నిజంగానే జేపీకి కాంగ్రెస్ గాలం వేసిందా.. ?  లేదంటే.. సర్వే సరదాగా అన్నారా.. ? ఇంకో మూడునెలలు కాస్త ఓపిక పడితే.. మనకే తెలుస్తోంది..

Exit mobile version