Site icon TeluguMirchi.com

ఈ సారి ఘనంగా జరగనున్న బల్కంపేట అమ్మవారి కల్యాణోత్సవం

జులై 13 వ తేదీన బల్కంపేట లోని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జులై 12 వ తేదీన ఎదుర్కోళ్ళు, 13 వ తేదీన అమ్మవారి కళ్యాణం, 14 వ తేదీన రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.

కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి తోపులాటకు గురికాకుండా భారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.

Exit mobile version