’బుడ్డోడి’పై బాలయ్య సెటైర్!

balayya-sattair-on-jr-ntr

నందమూరి బుడ్డోడు జూ. ఎన్టీఆర్ పై బాలయ్య సెటైర్ వేశాడు. “ప్రచారానికి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదని, పిలవడానికి ఇదేమీ పెళ్లి కాదని” బాలయ్య అన్నాడు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ని దృష్టిలో వుంచుకొనే బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా నామినేషన్ వేసే సమయంలోనే బాలయ్య  బుడ్డోడిపై సెటైర్ వేయడం విశేషం. అయితే, ఎవరైనా..  ప్రచారం చేయొచ్చని బాలయ్య పిలుపునిచ్చాడు. భారీ జనసందోహంతో పాటుగా హిందూపురం శాసన సభ స్థానానికి నామినేషన్ వేయడానికి బాలయ్య బయలుదేరాడు. మరీ.. బాలయ్య సెటైర్ కి బుడ్డోడి రియాక్షన్ ఎలా వుండబోతుందో..