బాలయ్య ను చూసి కుక్క మొరిగింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాల్గు రాజ్యసభ స్థానాలకు సంబందించిన పోలింగ్ ఈరోజు జరిగాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలయ్య కూడా ఓటు వేశారు. బాలయ్య ఓటు వేసి బయటకు నడుచుకుంటూ వస్తుండగా అసెంబ్లీ ఆవరణలో పక్కనే ఉన్న ఒక కుక్క మొరిగింది.

తనను చూసి మొరిగిన కుక్కను చూసి బాలయ్య వ్యంగ్యంగా ఓ డైలాగ్ చెప్పారు. ‘తాము అరిచేవాళ్లం కాదు.. కరిచేవాళ్లం’ అంటూ సినిమాటిక్ డైలాగ్ చెప్పారు. మనం కూడా కుక్క భాషలో మాట్లాడాలని అన్నారు. దీంతో పక్కనే ఉన్నవారంతా ఫక్కున పెద్దగా నవ్వారు. బాలయ్య బాబు సినిమాల్లోనే కాదు.. బయట కూడా డైలాగ్ లతో చంపేస్తాడు అంటూ మాట్లాడుకున్నారు.