మీడియా ముందే అభిమాని ఫై రెచ్చిపోయిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ కు కోపం ఎక్కువ అనే సంగతి తెలిసిందే. తనకు ఎదురువచ్చిన…తన మాటకు అడ్డుచెప్పిన అంతే..అది అభిమానైనా , మరోవారైనా అసలు ఊరుకోరు. నోటికొచ్చిన బూతులు వాడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు పలుమార్లు జరుగగా..తాజాగా హిందూపురం పర్యటన లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఈరోజు బాలయ్య తన నియోజకవర్గం అయిన హిందూపురంలో పర్యటించారు. ఆ సందర్బంగా అక్కడ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని ఆయన మాటలకూ అడ్డు వచ్చాడు. అంతే ”ఉష్ ఎవడ్రా అది.. నోరుముయ్” అని మీడియా ముందే అతని పై ఫైర్ అయ్యారు బాలయ్య.