Site icon TeluguMirchi.com

హిందూపూర్ నుంచి బాలయ్య.. !

balayya(1)

ఎన్నికల బరిలో బాలయ్య నిలబడటం ఖరారైనట్లు తెలుస్తోంది. కాకపోతే.. బాలయ్య బరిలో నిలిచే స్థానంపై మాత్రం స్పష్టత రాలేదు. నిన్న (బుధవారం) తెదేపా అధినేత చంద్రబాబు నాయుడితో బాలయ్య సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా, ఈరోజు ఉదయం బాలయ్య  మరోసారి బాబు సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. అయితే, బాలకృష్ణ హిందూపూర్ నుంచి బరిలో నిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. బాలయ్యను హిందూపూర్ నుంచి రంగంలోనికి దించితే.. సీమలో తెదేపాకు మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నది చంద్రబాబు ఆలోచన. మరోవైపు, కృష్ణాజిల్లా నుంచి బాలయ్య బరిలో నిలవాలని నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు. మరీ.. బాలయ్య బరిలో నిలిచే స్థానం ఏది..?? అన్నది మరికొద్ది సేపట్లో తేలనున్నట్లు సమాచారం.

Exit mobile version