నందమూరి బాలకృష్ణ మరోసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యి చంద్రబాబు కు కొత్త తలనొప్పి ని తీసుకొచ్చాడు. తాజాగా తన 102 వ సినిమా ఓపెనింగ్ లో తన అసిస్టెంట్ ని కొట్టి , చెప్పులు మోయించిన విధానం ఫై సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్ హీరో , అందులో మ్మెల్యే హోదా లో ఉండి ఇలాంటి పని చేస్తాడా అని విమర్శిస్తున్నారు.
గతం లో చాలాసార్లు బాలయ్య ఇలాగే వ్యవహరించాడు..కోపం వస్తే ఎవర్ని అని చూడడు..పక్కన ఎవరు ఉన్నారు అనేది కూడా చూడకుండా ఇలాగే కొట్టడం , నోటికి ఏది వస్తే అది తిట్టడం చేసాడు. ఇప్పుడు ఈ ఘటన తో మరోసారి వార్తల్లో నిలిచాడు. బాలయ్య తన అసిస్టెంట్ ని కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నంద్యాల ఉప ఎన్నికల వేళ బాలయ్య తీరు చంద్రబాబుకి తిప్పలు తెచ్చిపెడ్తోంది. గతంలో మహిళలపై బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్నీ, ఓ అభిమాని ఫోన్ని లాక్కుని బాలయ్య నేలకేసి కొట్టిన వైనాన్ని, తాజాగా అసిస్టెంట్ మీద చెయ్యి చేసుకున్న తీరునీ నేషనల్ మీడియా ప్రస్తావిస్తోంటే, ఇవన్నీ పార్టీకి సంకటం తెచ్చిపెడ్తాయని చంద్రబాబు తెగ ఫీలయిపోతున్నారు.