కేటీఆర్ కి చెక్ ఇచ్చిన బాలయ్య


కరోనా వ్యాప్తి నివారణ, సహాయచర్యల కోసం హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రూ.50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ.50 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. తాజాగా, తెలంగాణకు సంబంధించి తన విరాళం తాలూకు చెక్ ను మంత్రి కేటీఆర్ కు అందజేశారు. విరాళం అందించినందుకు బాలయ్యకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.25 లక్షలు అందించారు. సీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు సీ కల్యాణ్‌కు ఈ రూ.25 లక్షల చెక్‌ను బాలయ్య ఈ రోజు అందించారు. వీటిని సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తారు.