Site icon TeluguMirchi.com

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫై బాలయ్య కన్ను

నందమూరి బాలకృష్ణ జూన్ 10 న 60 వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అలాగే ఈసారి పుట్టిన రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అది బాలయ్య షష్ఠిపూర్తి కావడం. దీంతో ఈ ఈవెంట్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది నందమూరి కుటుంబం. ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఫ్యాన్స్ ఆత్రుత కనబరుస్తున్నారు. ఈ సందర్భాంగా బాలకృష్ణ సైతం వివిధ చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ ఆసక్తికర విషయాలను షేర్ చేస్తున్నాడు.

ఈ తరుణంలోనే రాజకీయ భవిష్యత్ పై పలు ప్రశ్నలు అడగ్గా బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. తాను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేయడం అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నింటికీ తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం తో ఆ పదవి ఫై బాలకృష్ణ ఇంట్రస్ట్ గా ఉన్నట్లు అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో హిందూపుర్ నిజయోజకవర్గం నుండి పోటీకి దిగి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన బాలయ్య ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ..తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టారు.

Exit mobile version